ఏపీలోని ప్రకాశం జిల్లాలో కన్న తల్లి పట్ల ఇద్దరు కొడుకులు కర్కశత్వంగా ప్రవర్తించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు తిండి పెట్టకుండా ఇబ్బందులకు గురిచేయడంతో పాటు యర్రగొండపాళెంలో స్థానికంగా ఉన్న హనుమాన్ ఆలయం వద్ద వదిలేసి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాపం ఆ తల్లి పైకి లేచేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతోంది.
లేచే ఓపికలేక, ఆహారం కూడా తినలేని స్థితిలో పడి ఉన్న వృద్ధురాలి ఘటనపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ తల్లికి ఆహారం అందించడంతో పాటు వసతి కల్పించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై అధికారులతో కలిసి కృషి చేస్తానని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. మంత్రి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కర్కశంగా తల్లిని వదిలేసిన కసాయి కొడుకులు
ప్రకాశం జిల్లా యర్రగొండపాళెంలో హృదయవిదారక ఘటన
రెండు రోజుల క్రితం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద తమ తల్లిని వదిలేసి వెళ్ళిన కసాయి కొడుకులు
పైకి లేవలేక, కనీసం చుట్టుపక్కల వారు ఇచ్చే… pic.twitter.com/AuwBoQYcbi
— BIG TV Breaking News (@bigtvtelugu) November 24, 2024