పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు ఆయనకు ఏ రేంజ్ లో క్రేజ్ సంపాదించి పెట్టాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. చేసింది తక్కువ సినిమాలు అయినా ఆ సినిమాల ద్వారా ఈయనకు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ తగ్గించి రాజకీయాలలో చాలా బిజీ అవుతున్నారు ఇలా రాజకీయాలలో సినిమా ఇండస్ట్రీలో బిజీగా కొనసాగుతున్నారు. తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇందులో భాగంగానే రెమ్యునరేషన్ గురించి ప్రశ్నించారు అయితే రెమ్యునరేషన్ విషయంలో ఆయన మోసపోయినట్లు ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాకు బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల తాను రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపారు. అయితే ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ తర్వాత నిర్మాత కొంత మాత్రమే తనకు ఇచ్చారని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. మరి గబ్బర్ సింగ్ సినిమా కైనా రెమ్యునరేషన్ ఫుల్ గా ఇచ్చారా అంటూ బాలయ్య ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతూ హా అన్నాడు. తాను అనుకున్నంత ఇచ్చాడు.. నేను అనుకున్నంత ఇవ్వలేదు అంటూ సమాధానం చెప్పారు. అయితే పవన్ అభిమానులు మాత్రం నిర్మాత బండ్ల గణేష్ ను గబ్బర్ సింగ్ సినిమా రెమ్యునరేషన్ విషయంపై నిలదీస్తున్నారు.
అయితే ఈ విషయంపై స్పందించిన బండ్ల గణేష్ ఒక్కమాటలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. భగవంతుడు అడగడు.. భక్తుడు ఇస్తాడు బాగుందా తమ్ముడు అంటూ నేటిజన్స్ చేసిన కామెంట్లకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. మరి గబ్బర్ సింగ్ సినిమా రెమ్యునరేషన్ విషయంలో పవన్ ఎంత ఎక్స్పెక్ట్ చేశారు బండ్ల గణేష్ ఎంత ఇచ్చారు అనే విషయంపై ఇంకా క్లారిటీగా వెలువడ లేదు. గబ్బర్ సింగ్ సినిమాతో నిర్మాత బండ్ల గణేష్ బాగా వెనకేసుకున్నట్టు తెలుస్తోంది.