దొండకాయ ఫ్రై ఇలా ఎప్పుడైనా చేశారా.. తింటే అస్సలు వదిలిపెట్టరుగా..!

-

దొండకాయ అంటే చాలామందికి అంతగా ఇష్టం ఉండదు. అది కట్ చేయడానికి మస్త్ టైం పడుతుందని కొందరు, అంత టేస్టీగా ఉండదు, వండటానికి చాలా సమయం కేటాయించాలి అని మరికొందరు వీటిని కొనడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఇంకోటి కూడా ఉందండోయ్..
దొండకాయ తింటే.. మందబుద్ది వస్తుందనే అపోహ కూడా ఉంది. ఇది ముమ్మాటికి తప్పే అని అధ్యయనాలు నిరూపించాయి. దొండకాయను ఆరోగ్యకరంగా వండుకుంటే..అరకేజీ అయినా ఈజీగా లాగించేయొచ్చు. మనం వండుకునే దొండకాయ ఫ్రై ను ఆయిల్ లేకుండా.. టేస్టీగా వండేయొచ్చు. ఇంకా ఇది చేసేందుకు పెద్దగా టైం కూడా పట్టదు.. ఇంకెందకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దామా..!

దొండకాయ ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు..

దొండకాయ ముక్కలు రెండు కప్పులు
పుల్లమజ్జిగా ఒక కప్పు
కొబ్బరి తురుము అరకప్పు
క్యారెట్ తురుము అరకప్పు
పచ్చిమిర్చి అరకప్పు
వేపించిన వేరుశనగపప్పులు రెండు టేబుల్ స్పూన్స్
జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్
పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి ఒక టీ స్పూన్
ధనియా పౌడర్ ఒక టీ స్పూన్
పసుపు కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా
కరివేపాకు కొద్దిగా
మీగడ ఒక టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం..

కుక్కర్ తీసుకుని అందులో చీలకల్లా చేసుకున్న దొండకాయ ముక్కలు వేసి.. పైన పసుపు, పుల్లమజ్జిగా వేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకూ ఉంచండి. మరీ మెత్తగా అయితే బాగుండదు. పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో జీడిపప్పు, పల్లీలు, పుట్నాలపప్పు, కరివేపాకు వేసి దోరగా వేడెక్కనివ్వండి. అలా చేసుకున్న వాటిని మిక్సీ జార్ లో వేసి పొడిలా చేసుకోండి. పొయ్యిమీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో మీగడ వేసి పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ప్రజర్ కుక్కర్లో ఉడికిన దొండకాయ ముక్కలు కూడా వేయండి. పైన జీలకర్ర పొడి, ధనియాల పొడి, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము వేసి వాటర్ కంటెంట్ తగ్గే వరకూ వేడెక్కనివ్వండి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి కూడా వేయండి. పైన కొత్తిమీర చల్లేసి తీయడమే.! సూపర్ టేస్టీగా ఉండే.. హెల్తీ దొండకాయ ఫ్రై రెడీ.!
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version