మంకీపాక్స్ ను గుర్తించే ప్రత్యేక కిట్ ఇదే..!!

-

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని అనుకుంటున్న సమయంలో.. మంకీపాక్స్ వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 20 దేశాలకు మంకీపాక్స్ వైరస్ సోకగా.. రెండు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరో వంద వరకు అనుమానిత కేసులు ఉన్నాయి. అయితే ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు పరిశోధకులు పలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే దేశానికి చెందిన మెడికల్ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్ హెల్త్ కేర్.. మంకీపాక్స్ ను గుర్తించేందుకు ప్రత్యేక కిట్‌ను తయారు చేసింది.

monkeypox-virus

మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించేందుకు ట్రివిట్రాన్ హెల్త్ కేర్‌కు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్ ఆర్‌టీ-పీసీఆర్ కిట్‌ను తయారు చేసింది. ఇది నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్ ఆధారిత కిట్. వన్ ట్యూబ్ సింగల్ రియాక్షన్ ఫార్మాట్‌లో స్మాల్‌పాక్స్, మంకీపాక్స్ వైరస్‌లను గుర్తించడం చేస్తుంది. ఒక గంట సమయంలోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఈ కిట్‌తో పరీక్ష చేసుకునేందుకు పొడి స్వాబ్‌లతోపాటు వీటీఎం స్వాబ్‌లను కూడా వాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version