సాధారణంగా చాలామంది స్టార్ హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు.. రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతూ తమ ఆస్తిని రెట్టింపు చేసుకుంటున్న విషయం తెలిసిందే.. మరికొంతమంది ఐపిఎల్, ఫుట్బాల్ వంటి టోర్నమెంట్స్ లో పెట్టుబడిగా పెడుతుంటే మరికొంతమంది రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడుతూ.. ఇంకొంతమంది థియేటర్లు, నిర్మాణ రంగంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ భారీగా లాభాలను సొంతం చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోని ఈరోజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆస్తి ఎంత ఉంది అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ విషయాలను ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..
విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగార్జున 6 పదుల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ అంతే జోష్ మీద దూసుకుపోతున్నారు. ఒక్కొక్క సినిమాకు సుమారుగా రూ.10 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు తన తండ్రి ఏర్పాటు చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ మొత్తం నాగార్జున దగ్గరుండి చూసుకోవడం గమనార్హం. ఇక వీటితోపాటు పలు వ్యాపార ప్రకటనలకు, జువెలరీ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు మీలో ఎవరు కోటీశ్వరులు, బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ కొన్ని కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారు నాగార్జున.