కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో రూ.10వేల కోట్లు భారీ ఆర్థిక కుంభకోణానికి సీఎం రేవంత్ పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ..ఓ బీజేపీ ఎంపీ సహకారంతో సీఎం రేవంత్ ఈ స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రూ.170 కోట్ల లంచం కూడా ఇచ్చారన్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ఆ 400 ఎకరాలు అటవీభూమిని అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.
తదుపరి ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్‌కు సహకరించిన ఆ బీజేపీ ఎంపీ పేరు బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.‘ఈ HCU భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే TGIICకి బదిలీ చేశాడు. కానీ, ఇంకా మ్యుటేషన్ చేయలేదు. సీఎం రేవంత్ భూముల రేట్లు మార్చి, లేని వాల్యూను ఉన్నట్లు చూపించి RBIని మిస్ లీడ్ చేసి స్కాం చేశాడు. తనది కాని భూమిని TGIICతో తాకట్టు పెట్టించి..రేవంత్ రెడ్డి రూ.10000 కోట్లు తెచ్చుకొని RBI గైడ్‌లైన్స్‌ని తుంగలో తొక్కాడు’ అని కేటీఆర్ ఆరోపించారు.