దసరా, దీపావళి పండుగల సందర్భంగా ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే వారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పలు ఆఫర్లను అందిస్తోంది. ఈ క్రమంలో వినియోగదారులు రోజుకు కేవలం రూ.77తో తమ డ్రీమ్ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.
దసరా, దీపావళి పండుగల సందర్భంగా చాలా మంది సహజంగానే టూ వీలర్‌లను కొనుగోలు చేస్తుంటారు. పండుగ రోజు కొంటే చాలా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో కొందరు ఈ సమయాల్లో బైక్‌లను కొనుగోలు చేస్తే.. మరికొందరు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టూ వీలర్ తయారీ కంపెనీలు అందించే ఆఫర్లకు ఆకర్షితులై బైక్‌లను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే అలాంటి వినియోగదారుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తోంది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దసరా, దీపావళి పండుగల సందర్భంగా ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే వారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పలు ఆఫర్లను అందిస్తోంది. ఈ క్రమంలో వినియోగదారులు రోజుకు కేవలం రూ.77తో తమ డ్రీమ్ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. లోన్‌కు కూడా ప్రాసెసింగ్ ఫీజు ఏమీ వసూలు చేయడం లేదు. అలాగే జీరో డౌన్ పేమెంట్‌తో బైక్ కొనే సదుపాయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తోంది. ఇక హీరో బైక్‌లు, స్కూటర్లను కొంటే రూ.2వేల డిస్కౌంట్ ఇస్తారు.
పండుగల సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో టూ వీలర్ లోన్ తీసుకుంటే కేవలం 10 సెకన్లలోనే లోన్‌ను ప్రాసెస్ చేసి కస్టమర్లకు రుణం అందిస్తారు. హోండా బైక్‌లను కొంటే రూ.8900 వరకు ఆదా చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నారు. ఇక వినియోగదారులు తమకు సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ ఆఫర్లకు చెందిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.