ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్కు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కాం కేసులో కేజీవాల్ను రెండు గంటల పాటు విచారించారు. అనంతరం ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకున్నారు. కేజీవాల్ను ఈడీ ఆఫీస్కు తరలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి, ఆప్ సీనియర్ నేత అతిశీ కీలక వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీకి అరవింద్ కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. కేజీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆమె తెలిపారు. సీఎంను ఈడీ అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఆమె చెప్పారు. దీనిపై ఈరోజు రాత్రే విచారణ జరపాలని కోరామన్నారు.కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే .