మేనేజర్ తో ఆ * ఒప్పుకుంటే ఎంతైనా ఇస్తానన్నాడు: బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ..!

-

తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది కేవలం బిగ్ బాస్ రియాల్టీ షో అని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పటికే ఐదు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఎట్టకేలకు ఆరవ సీజన్ సెప్టెంబర్ 4న స్టార్ మా చానల్లో ప్రారంభమయ్యింది.. ఈ బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా అందులో ఒక్కొక్కరు ఒక్కో రకమైన తమ చేదు అనుభవాలను వెల్లడిస్తున్నారు… ఇక ఈ క్రమంలోనే గలాటా గీతూ కూడా తన చేదు అనుభవాన్ని కంటెస్టెంట్లతో పంచుకుంది. అసలు ఏమైందో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.

సాధారణంగా ఎప్పటిలాగే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేముందు కంటెస్టెంట్లతో ఇంటర్వ్యూలు జరుపుతూ ఉంటారు . అలా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గలాటా గీతూ మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్లు చేసింది. నిజానికి గలాటా గీతూ ఒకప్పుడు టిక్ టాక్ వీడియోలు చేస్తూ అలాగే బిగ్ బాస్ షో మీద రివ్యూలు ఇస్తూ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. చిత్తూరు యాసలో గలగల మాట్లాడే ఈమె ఎన్నో విషయాలను ఇంటర్వ్యూలో పంచుకుంది.. ఆమె మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం .. ఎంత ఇష్టమంటే చేయి కోసుకోవడానికి కూడా వెనకాడను అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. ఇక అంతే కాదు రెండు పెద్ద బ్యానర్ల నుంచి తనకు అవకాశాలు వచ్చాయని కానీ నటన రాని కారణంగా వదులుకున్నానని తెలిపింది.

ఇకపోతే ఇండస్ట్రీలో నాకు కూడా చేదు అనుభవం ఎదురయింది. ఒకరోజు ఆస్ట్రేలియాలో ఒక ఈవెంట్ ఉందని నాకు ఫోన్ వచ్చింది. నేను ఆ ఈవెంట్ కి ఓకే చెప్పాను . ఎందుకంటే నాకు హోస్టింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే ఆస్ట్రేలియా కాబట్టి ఎంచక్కా ఎక్కువ డబ్బులు ఇస్తారు.. అలాగే షాపింగ్ కూడా చేసుకోవచ్చని ఆ ఈవెంట్ కి ఒప్పుకున్నాను. కానీ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ మేనేజర్ పి.ఏ. నాకు ఫోన్ చేసి మా మేనేజర్ తో పర్సనల్గా కలవడానికి మీకు ఓకే కదా అని అడిగాడు.. అంతేకాదు మీరు అలా చేస్తే ఎక్కువ డబ్బులు కూడా ఇస్తామని అనడంతో నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను .. ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నాను అంటూ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె చెప్పుకొచ్చింది.. అంతేకాదు గ్లామర్ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఇలాంటి దారుణమైన సంఘటనలకు గురి అవుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version