బీఆర్ఎస్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. అయితే, కవిత పర్యటన సందర్భంగా కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ నాయకులు కవిత రాక కోసం స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కట్టారు. నిన్న రాత్రి ఆ ఫ్లెక్సీలను మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు చింపివేడయంతో పాటు బీఆర్ఎస్ నేతను చితకబాదారు.
ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం బాధిత పార్టీ నేతను కవిత పరామర్శించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ సొంత జిల్లా నుంచి చెబుతున్నా కచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. BRS కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా, అధికారులనైనా ఎవరినీ వదిలిపెట్టం. పింక్ బుక్ లో అందరి చిట్టా రాసుకుంటాం’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నా…కచ్చితంగా పింక్ బుక్ మైంటైన్ చేస్తాం : MLC కవిత
BRS కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా, అధికారులనైనా ఎవరిని వదిలిపెట్టం. పింక్ బుక్ లో అందరి చిట్టా రాసుకుంటాం – MLC కవిత pic.twitter.com/1lrLvN9LGT
— ChotaNews App (@ChotaNewsApp) February 28, 2025