ఎమ్మెల్సీ ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు అయినట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా – గంగాధర ఎక్స్ రోడ్డు వద్ద ఎమ్మెల్సీ ఎలక్షన్ బాక్సులు తీసుకువెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు.. నిర్మల్ నుంచి పోలింగ్ సామగ్రి తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా ముందు వెళ్తున్న బస్సును వెనక నుంచి ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలవ్వగా..ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా? లేదా ఎలా జరిగిందనేది తెలియరాలేదు.
ఎమ్మెల్సీ ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సుకు రోడ్డు ప్రమాదం.. 20 మందికి గాయాలు
కరీంనగర్ జిల్లా – గంగాధర ఎక్స్ రోడ్డు వద్ద ఎమ్మెల్సీ ఎలక్షన్ బాక్సులు తీసుకువెళ్తున్న ఎలక్షన్ సిబ్బందికి రోడ్డు ప్రమాదం
నిర్మల్ నుంచి పోలింగ్ సామగ్రి తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా ముందు వెళ్తున్న… pic.twitter.com/jtVdGUuJX2
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2025