హుజూరాబాద్ ఫైట్: అసలు తలనొప్పి వారితోనే…!

-

హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఏ మేర ప్రభావం చూపుతుంది…ఆ పార్టీకి అసలు గెలిచే సత్తా ఉందా? అంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం బట్టి చూస్తే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు గెలిచే సీన్ లేదనే క్లారిటీగా అర్ధమవుతుంది. అందుకే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం హుజూరాబాద్ ఉపఎన్నికని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

Huzurabad | హుజురాబాద్

అయితే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చేసి…. టి‌ఆర్‌ఎస్ లేదా బి‌జే‌పిలకు నష్టం చేయొచ్చని ప్రచారం మాత్రం జరుగుతుంది. కాంగ్రెస్ ఓట్లు చీల్చడం వల్ల ఇటు ఈటల రాజేందర్‌కు ఇబ్బంది అవుతుందా లేక అటు గెల్లు శ్రీనివాస్‌కు నష్టం జరుగుతుందా? అనే ప్రశ్న వస్తే….అసలు నష్టం జరిగేది కాంగ్రెస్‌కే అని గట్టిగా చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ ఓట్లే….ఈటల-టి‌ఆర్‌ఎస్‌లు చీల్చుకుంటున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 60 వేల ఓట్లు పడ్డాయి…అసలు ఇక్కడ బి‌జే‌పికి ఓట్లు లేవు. కానీ ఇప్పుడు ఈటలని బట్టి బి‌జే‌పికి ఓట్లు పడతాయి….ఈటల ఇప్పుడు టి‌ఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ఓట్లు చీల్చి సత్తా చాటే అవకాశం ఉంది.

కానీ కౌశిక్ రెడ్డిని చేర్చుకుని కాంగ్రెస్ ఓట్లు మొత్తం షిఫ్ట్ అవుతాయని అనుకోవడం టి‌ఆర్‌ఎస్ అవివేకం. ఇక్కడ ఎటు చూసిన టి‌ఆర్‌ఎస్‌కే డ్యామేజ్ జరిగేలా ఉంది. అటు కాంగ్రెస్ ఎలాగో లైట్ తీసుకుంది కాబట్టి, టి‌ఆర్‌ఎస్‌కే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ ఇండిపెండెంట్లు వల్ల తలనొప్పి ఉంది….వారి వల్ల టి‌ఆర్‌ఎస్‌కి ఇబ్బంది అవుతుందా…లేక ఈటలకి ఇబ్బంది అవుతుందా అనేది చెప్పలేం.

ఉదాహరణకు దుబ్బాక ఉపఎన్నిక చూసుకుంటే… ఆ ఎన్నికల్లో బి‌జే‌పి కేవలం 1400 ఓట్ల తేడాతో టి‌ఆర్ఎస్‌పై గెలిచింది..కానీ ఇక్కడ ఒక ఇండిపెండెంట్ అభ్యర్ధికి 3 వేల పైనే ఓట్లు పడ్డాయి. అలాగే ఇతరులకు 2 వేల లోపు ఓట్లు పడ్డాయి. ఒకవేళ ఇండిపెండెంట్లు తగ్గితే టి‌ఆర్‌ఎస్‌కు బెనిఫిట్ అయ్యేదనే కోణం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇండిపెండెంట్ల వల్ల టి‌ఆర్‌ఎస్‌కే పెద్ద తలనొప్పి అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version