ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారి పోయాయి. దాంతో లేని పోనీ రోగాలను మనం కొని తెచ్చుకుంటున్నాము.పట్టుమని ముప్పైఏళ్ళు రాకముందే షుగర్లు, బిపి లు తెచ్చుకుంటున్నారు.ఎంతగా రోగాలు వచ్చిన వైద్యులను సంప్రదించడం పక్కన పెట్టి అది, ఇది అంటూ సొంత ప్రయోగాలు చేస్తున్నారు.మిగిలిన దేశాల వాల్లతో పోలిస్తే ఇండియాలో ఇలాంటి నమ్మకాలు కాస్త ఎక్కువ అన్న సంగతి తెలిసిందే..తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఒక బావిలో నీరు తాగితే షుగర్ జన్మలో రాదని ప్రచారం జరుగుతుంది.. అంతేకాదు దీర్ఘకాలంగా వేధిస్తున్న ఎన్నో అనారోగ్య సమస్యలు నయం అవుతాయని నమ్ముతున్నారు..
ఇంతకీ ఆ బావి ఎక్కడ ఉంది, వాళ్ళు చెబుతున్నది నిజమా..లేదా అన్నది ఒకసారి చూద్దాం..హర్యానా రాష్ట్రంలోని రెవాడి జిల్లా గుజరీవాస్ గ్రామంలో నివాసం ఉండే మాండురామ్ తన పొలాన్ని స్థానికంగా ఉండే అలీ మహమ్మద్ అనే వ్యక్తికి కౌలుకిచ్చాడు. అయితే ఆ పొలంలో బోరు బావి ఉంది..అతని భార్య గత కొన్ని రోజులుగా ఆ బావిలో నీళ్ళను తాగుతుంది.. దాంతో ఆమెకు ఉన్న షుగర్ పూర్తిగా నయం అయిందట..
ఈ క్రమంలో అదే విషయాన్ని ఆమె ఇరుగు పొరుగు వారికి చెప్పగా..అలా ఆ విషయం చుట్టు పక్కలంతా వ్యాపించడంతో పాటు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ కావడంతే.. ఇక ఆ బోరుబావిలో ఉన్న నీటిని తాగేందుకు చాలా మంది ఇప్పుడు ఆ గ్రామానికి క్యూ కడుతున్నారు. ఆ బోరుబావిలో ఉన్న నీటిని తాగితే డయాబెటిస్ మాత్రమే కాదు, పలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయని జోరుగా ప్రచారం జరగడంతో ఆ బావి వద్దకు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.
ఈ క్రమంలో సదరు బావిలోని నీటిని లీటర్‌కు 50 కు అమ్ముతున్నారట. అలాగే ఆ బావి ఉన్న పొలం దగ్గరకు వచ్చేవారికి చుట్టు పక్కల పొలాల వారు కొంత రుసుం వసూలు చేసి వాహనాల పార్కింగ్, ఇతర సదుపాయాలను కూడా అందిస్తున్నారట. అయితే ఈ విషయం సైంటిస్టులకు తెలియడంతో వారు ఆ బోరు బావి నీటిని పరీక్షించి చూశారు. కాగా అందులో ఔషధ గుణాలు మాత్రం లేవని,పైగా అందులో బాక్టీరియా పుష్కలంగా ఉందని, కనుక ఆ నీటిని తాగితే అనారోగ్య సమస్యలు మాయమవడం మాట దేవుడెరుగు కొత్త రోగాలు రావడం పక్కా అని చెబుతున్నారు..సైన్స్ ఇంతగా పెరుగుతున్న కూడా ఇలాంటి నమ్మకాలు ఏంటో అని కొందరు విమర్శలు చేస్తున్నారు.