చాల మంది రాగులని ప్రతీ రోజు తీసుకుంటూ ఉంటారు. రొట్టె, ముద్ద, జావ ఇలా ఏదైనా చేసుకుని తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న ఆరోగ్యానికి చాల మేలు చేస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు రాగి జావ తీసుకోవడం మంచిది. అలానే రక్తహీనతను తగ్గిస్తుంది. ఇలా ఒకటేమిటి చాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా ఇప్పుడే చూడండి. రాగులతో చేసిన ఆహార పదార్థాలు తీసుకొనడం వల్ల నూతన శక్తి వస్తుంది.
రాగి జావ చేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారు రాగులు తీసుకుంటే చాల మంచిది. వీటిలో ఉండే అమినో యాసిడ్స్, ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం కలిగి ఉండడం వల్ల ఆకలి తక్కువగా అనిపిస్తుంది. దీనితో తక్కువ తింటే సరిపోతుంది. ఇలా ఆటోమేటిగ్ గా బరువు తగ్గుతారు. అలానే రాగుల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కూడా ఆకలి అనిపించదు. రాగుల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. అంతే కాదండి దీనివల్ల మలబద్ధక సమస్య తీరుతుంది.
బిపి, షుగర్ ఉన్నవాళ్లు రాగి జావ తీసుకోవడం వల్ల నియంత్రణలో ఉంటాయి గుర్తుంచుకోండి. దీని వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాలేయ వ్యాధులు, గుండె బలహీనత,ఉబ్బసం వంటి సమస్యలు తగ్గాలంటే తరచూ రాగులని తీసుకోండి. రాగులతో చేసిన వాటిని తీసుకుంటే ఎముకలు దృఢంగా కూడా ఉంటాయి. చూసారా ఎన్ని ప్రయోజనలో..! మరి మీ సమస్యలకి కూడా రాగులతో సులువుగా చెక్ పెట్టేయండి.