ఆటో: సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న మారుతీ సుజుకూ వ్యాగనార్

-

భారతదేశంలో మధ్యతరగతికి అనుకూలమైన కార్ ఏదైనా ఉందంటే ప్రతి ఒక్కరి దగ్గర నుండి వచ్చే సమాధానం మారుతి సుజుకి. అటు హై రేంజ్ కాకుండా ఇటు మరీ లో క్వాలిటీ కాకుండా మధ్య రేంజ్‍లో ధరలకు కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది మారుతి సుజుకి.

తాజాగా మారుతి సుజుకి వ్యాగనార్ కారు 25 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. భారతదేశ మార్కెట్లో 25 సంవత్సరాల నుండి అందుబాటులో ఉన్న ఈ కారు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

1999లో లాంచ్ అయిన మారుతి సుజుకి వ్యాగనార్ కారును అప్పట్లో టాల్ బాయ్ అని పిలిచేవారు. మొదట్లో మూడు లక్షలు (ఎక్స్ షోరూం) ప్రైస్ తో వినియోగదారులకు అందుబాటులో ఉంది వ్యాగనార్.

వ్యాగనార్ ప్రత్యేకతల్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే.. వరుసగా మూడు సంవత్సరాలు ఇండియాలో అత్యధిక అమ్ముడుపోయిన కార్లు ఇవే.

అదీగాక.. ఇప్పటివరకు 6.6 లక్షల సీఎన్జి మోడల్ కార్స్ ని అమ్మింది మారుతి సుజుకి. 25 సంవత్సరాల్లో వ్యాగనార్ కార్లలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం థర్డ్ జనరేషన్ నడుస్తోంది.

కొత్తగా రిలీజ్ అవుతున్న కార్లలో సేఫ్టీ ఫీచర్స్ అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆటో గేర్ టెక్నాలజీ తో కూడా వ్యాగనార్ కార్లు లభ్యమవుతున్నాయి.

తాజాగా వ్యాగనార్ కారు కొనాలనుకుంటే.. స్టార్టింగ్ ప్రైస్ 5.54 లక్షల నుండి 7.33 ఎక్స్ షోరూం వరకు ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version