తృణధాన్యాలు తింటే కలిగే లాభాలు తెలిస్తే.. మీరు వాటిని అస్సలు వదలరు..!

-

అన్నం.. అన్నం.. అన్నం.. రోజూ అదేనా.. పుట్టినప్పటి నుంచి అదే అన్నాన్ని పొద్దునా.. మధ్యాహ్నం.. రాత్రి. బోర్ కొట్టట్లే. పోనీ.. ఆ అన్నం ఏమన్నా.. ఆరోగ్యానికి మేలు చేస్తుందా అంటే అదీ లేదు. లేని పోని సమస్యలు తప్ప. ఆరోగ్య సమస్యలు వస్తున్నా ఎందుకు ఆ అన్నాన్ని తినడం అంటే.. చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కదా. మన తల్లిదండ్రులు మనకు అన్నం తినడమే నేర్పించారు. తృణధాన్యాలు తినడం నేర్పించలేదు. అందుకే.. అన్నం తప్పించి ఇంకో ఫుడ్డే తెలియని బతుకులు మనవి. కానీ.. మెల్లమెల్లగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి.. ఏం తినకూడదు. ఎప్పుడు తినాలి.. ఎప్పుడు తినకూడదు.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటున్నారు. డాక్టర్లు కూడా ఆరోగ్యంగా పది కాలాల పాటు బతకాలంటే చిరు ధాన్యాలు లేదా తృణ ధాన్యాలను తినాలంటూ సూచిస్తున్నారు. తృణ ధాన్యాలా? ఏంటవి. వాటిని ఎప్పుడూ చూడలేదే అంటారా? మన తాతలు.. ముత్తాతలు.. ఆ చిరు ధాన్యాలను తిని బతికినవాళ్లే. మనమే పాష్‌గా అన్నం తిని బతుకుతున్నాం. అనారోగ్యానికి గురవుతున్నాం. తాతలు.. ముత్తాతలు చిరుధాన్యాలను తిన్నారు కాబట్టే.. వందేళ్లు బతికారు. మనం తినడం లేదు కాబట్టే.. 50 ఏళ్లకే కుయ్యో.. ముర్రో అంటున్నాం. సరే.. అసలు తృణ ధాన్యాలు అంటే ఏంటి.. వాటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం పదండి.

జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, అవిసెలు.. వీటినే తృణ ధాన్యాలు అంటారు. వీటన్నింటిలో ఉండే పోషకాలు, కాల్షియం, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు… మనిషికి వచ్చే రకరకాల లైఫ్ స్టయిల్ రోగాలను రానివ్వవు. ప్రతి రోజు చిరుధాన్యాలను తినడం అలవాటు చేసుకుంటే.. ఎటువంటి వ్యాధి కూడా దరిచేరదు. ముఖ్యంగా గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, రక్తస్రావం వంటి సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు తృణ ధాన్యాలను తింటే వాళ్లకు ఆ సమస్యలు తీరుతాయి. అందుకే ఇప్పుడు చిరు ధాన్యాలకు మార్కెట్ మంచి గిరాకీ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version