పండ్లతోటల్లో బెరడు తొలిచే పురుగులా..? నివారణకు ఇలా చేయండి..!

-

ఈ మధ్యకాలంలో రైతులు ఉద్యానవన పంటలపై మొగ్గుచూపుతున్నారు. వీటి సాగు కూడా లాభదాయకమే. అయితే వీటికి పురుగుల బెడద అధికంగా ఉంది. కొబ్బరి, కోకో, మామిడి, చీని, మునగ, మల్బరీ తోటల్లో బెరడు తొలిచే పురుగు ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు నివారణకు కోసం రైతులకు నిపుణులు కొన్ని సూచనలు చేశారు. మొదట ఈ పురుగల పై రైతులకు అవగాహన ఉండాలి..

ఈ పురుగు లేత కొమ్మలపై ఎక్కువగా దాడి చేస్తుంది. లేత గోధుమ రంగులో ఉన్న తల్లి పురగులు మే , జులై లో కోశస్ధ దశ నుండి బయటకు వచ్చి బెరడు వదులుగా ఉన్న ప్రదేశాల్లో గుడ్లు పెడతాయి.. 10 రోజుల తరువాత గుడ్లు పొదిగి ముదురు గోధుమ రంగులో గొంగలి పురుగు బయటకు వచ్చిన తరువాత గూళ్ళలో ఉంటాయి. పిల్ల గొంగళి పురుగులు బెరడును తిని కాండంలోకి తొలుచుకుపోతాయి. పగటి పూట కాండంలో ఉంటూ రాత్రుళ్లు.. అవి విసర్జించిన పదార్ధాల్లో తయారైన గొట్టం అకారంలో ఉన్న దారి ద్వారా బయటకు వచ్చి బెరడును తింటాయి.

ఈ పురుగు విసర్జించిన రంపపు పొట్టుతో కట్టుకున్న గూళ్ళు చెట్టు కాండంపైన స్పష్టంగా కనిపిస్తాయి. అయితే.. ఈ పురుగులను రైతులు చెదపురుగుల ఆశించాయని అపోహపడతారు. దీని గొంగళి పురుగు దశ సుమారు 9 నుండి 10 నెలల వరకు ఉంటుంది. ఈ పురుగు ఆశించటం వల్ల చెట్టు కాండంపై బెరడు కోల్పోయి పుష్సాలు రాక పిందెలు ఏర్పడవు. పెద్ద చెట్టు చిన్న చెట్ల కన్నా ఎక్కువ ఎఫెక్ట్ అ‌వుతాయి.

బెరడు తొలిచే పురుగుల నివారణకు ఏం చేయాలంటే..

దీని నివారణకు వదులుగా ఉన్న దెబ్బతిన్న బెరడును , కొమ్మలను పురుగు అశించిన కొమ్మలను తొలగించి కాల్చివేయాలి. లద్దె పురుగులు చేసిన రంధ్రాల్లో ఇనుప చువ్వలతో పొడిచి చంపాలి. రంధ్రాలను గమనించి దానిలో పెట్రోల్ లేదా కిరోసిన్లో ముంచిన దూదిని పెట్టాలి. పురుగు అశించిన రంధ్రంలోకి 0.5మి.లీ లీటరు నీటిలో కలిపి క్లోరాన్ట్రనిప్రోల్ లేదా డైక్లోరోవాస్ ని సిరంజ్ ఉపయోగించి పంపాలి. తరువాత బురదతో రంధ్రాన్ని పూడ్చాలి. తల్లి పురుగును ఆకర్షించటానికి దీపపు ఎరలను అమర్చుకోవాలి.

ఈ విధంగా చేయటం వల్ల పండ్లతోటలకు వచ్చే పురుగుల బెడదను తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version