పండ్లు తినడానికి కష్టపడుతున్నారా.. అయితే ఇలా చేయండి…?

-

పండ్లు, కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. సరే అని తినడం మొదలుపెడదాం. ఒకటి రెండు రోజులు బాగా పాటిస్తాం. ఏం చేస్తాం బోర్‌ కొడుతుంది. ఈ ఒక్కరోజే కదా అని మానేస్తాం. తర్వాతి రోజు కూడా అలానే అవుతుంది. ఇంకేముంది కథ మళ్లీ మొదటికి వస్తుంది. పిల్లలు అడగరు. పెద్దలు పండ్లు కోసి పెట్టడం మర్చిపోతుంటారు. ఈ కథ అందరి ఇంట్లో జరిగేదే. అయితే ఇందుకు ఓ పరిష్కారం కూడా ఉంది. అసలు పండ్లు తినడానికి సమస్య ఎంటో ఆలోచిస్తే సరి. పండ్లు కోసి అవి తినడానికి బద్ధకం అనిపిస్తే వాటిని ఇష్టమొచ్చినట్టుగా కట్‌ చేసి మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్‌ చేస్తే సరిపోతుంది. గట్టిగా ఉన్న పండ్లు కాస్త ద్రవరూపంలోకి మారిపోతుంది.

ఇక అంతే మంచినీరు తాగాలనుకున్నప్పుడు ఆ జూస్‌ తాగితే సరిపోతుంది. ఇలా ఎందుకంటే.. పిల్లలు, పెద్దలు కానీ ప్రత్యేకంగా ఏదైనా తాగమని చెబితే వారు తాగేందుకు ఇష్టపడరు. అందుకే మంచినీరు ద్రవరూపమే. దానికి బదులు ఇది తాగితే ఆరోగ్యానికి, అందానికి మంచిదే కదా అని ఒకసారి ఆలోచిస్తారు. ఆలోచనలో పడితే దానికి ఫాలో అవుతారని తెలుసుకోవాలి. అయితే ఎలాంటి పదార్థాలను ద్రవరూపంలోకి మార్చి తాగితే మంచిదో తెలుసుకోండి.

ఈ జ్యూస్‌లు తాగండి

క్యారెట్‌ : ఆరోగ్యానిక మంచిది. కంటిచూపు మెరుగుపడుతుంది. ఇందులో కెరోటిన్‌ కాలేయానికి మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఉపయోగపడుతుంది సుమీ! చాలామంది ఉదర సంబంధ వ్యాధులతో బాధపడుతుంటారు. వారికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, క్యాన్సర్లను నిరోధించే శక్తి దీనిలో ఉంది.

తోటకూర రసం : చేదుగా ఉండే పదార్థాలే ఆరోగ్యానికి మంచి చేకూరుస్తుంది. అందులో ఒకటి కాకరకాయ అని చెప్పవచ్చు. అలాగే భోజనం చేసే గంట ముందు తోటకూర రసం తీసుకుంటే మంచిది. ఇది రక్తంలోని షుగర్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఇలా రోజుకు రెండు సార్లు చొప్పున తీసుకోవాలి. భవిష్యత్తులో మధుమేహ వ్యాధిబారిన పడకుండా ఉండవచ్చు.
టమాట రసం : వారానికోసారి టమాటా రసం తీసుకుంటే గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

కీర : ఈ జ్యూస్‌ తాగితే జాయింట్ల రుగ్మతలను పోగొడుతుంది. దీనిలో ఉండే అత్యున్నత స్థాయి పొటాషియం కిడ్నీలను శుభ్రపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారించే మంచి ఔషధంలా పనిచేస్తుంది.

కొత్తిమీర : ఇందులో కాల్షియం కంటెంట్‌ ఎక్కువ. ఇది ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. నెలసరి సమయంలో కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల ఆ సమయంలో వేధించే నొప్పులు, ఎదురయ్యే ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు.

బీట్‌రూట్‌ : ఈ రసం తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో పాటు నాడుల ఆరోగ్యం, జ్ఞాపక శక్తి కాలేయం పనితీరు మెరుగుపడడానికి తోడ్పడుతుంది. విటమిన్‌ బి ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పెదాలు పొడిబారకుండా చూస్తుంది.

– వీటితో పాటు ద్రాక్ష, సపోటా, పొప్పడి, ఇలా మీకు నచ్చిన కూరగాయలు, పండ్లను జ్యూస్‌లుగా అంటే ద్రవరూపంలోకి మార్చి తాగి ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version