త్వరలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.అయితే కేంద్రప్రభుత్వం తెచ్చిన సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయినాయి.ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం రాజకుంది.ఇక CAA పై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించనుంది. CAA నిబంధనలపై స్టే విధించాలని వచ్చిన పిటిషన్లను మార్చి 19న విచారించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించింది. కాగా.. CAAలో సవరణలు మత ప్రాతిపదికన జరిగాయని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే….పౌరసత్వ సవరణ చట్టం-2019 కోసం త్వరలో అందుబాటులోకి తెచ్చే పోర్టల్లో పౌరసత్వం కోసం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం బాధితులను కోరింది.ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.