ఆర్జీవీ ముందస్తు బెయిల్‌పై నేడు హైకోర్టులో విచారణ

-

రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడుపై ఆయన తనయుడు నారా లోకేశ్‌తో పాటు పవన్ కళ్యాణ్ మీద అనుచిత పోస్టులు పెట్టిన క్రమంలో ఆయన మీద ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో ఆర్జీవీపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

ప్రస్తుతం ఆర్జీవీ అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్జీవీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్‌ వేశారు. కాగా, ఆర్జీవీ వేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో చంద్రబాబు మీద పెట్టిన అనుచిత పోస్టులకు గాను టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య ఇటీవల ఒంగోలు పోలీసులకి ఫిర్యాదు చేయగా.. విచారణ కోసం వర్మకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరయ్యేందుకు నో చెప్పిన వర్మ 4 రోజుల గడువు అడిగి ప్రస్తుతం ఫోన్ నంబర్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news