గుండె ఆరోగ్యం బాగుండాలా..? అయితే తప్పక వీటిని తీసుకోండి..!

-

ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న వయసులోనే గుండె సమస్యలతో బాధపడుతున్నారు తక్కువ వయసులోనే గుండెపోటు రావడం వంటివి జరుగుతున్నాయి. సెలబ్రిటీలు కూడా చాలామంది గుండెపోటుతో చనిపోయారు. అయితే మీ గుండె ఆరోగ్యంగా ఉండాలన్న గుండె సమస్యలు మీ దరి చేరకుండా ఉండాలన్నా వీటిని కచ్చితంగా డైట్ లో తీసుకుంటూ ఉండండి. వీటిని కనుక మీరు డైట్ లో తీసుకుంటే గుండె సమస్యలకి దూరంగా ఉండొచ్చు అలానే మీకు ఉండే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

హృదయ ఆరోగ్యం కోసం వీటిని తప్పకుండా తీసుకోండి:

సాల్మన్:

సాల్మన్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె ఆరోగ్యానికి సాల్మన్ బాగా పనిచేస్తుంది. మీ గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే డైట్ లో తప్పకుండా సాల్మన్ ని తీసుకోండి. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి గుండె ఆరోగ్యానికి ఇవి అవసరం. అలానే ధమనుల్లో రక్తప్రసరణకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తాయి.

ఆలివ్ ఆయిల్:

గుండె ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ, విటమిన్ కే ఎక్కువ ఉంటుంది ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

అవకాడో:

చెడు కొలెస్ట్రాన్ని తొలగించడానికి అవకాడో బాగా సహాయపడుతుంది హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

బ్రోకలీ:

గుండె ఆరోగ్యానికి బ్రోకలీ కూడా బాగా మేలు చేస్తుంది. కనుక దీన్ని తీసుకుంటే కూడా గుండెపోటు వంటివి రావు.

ఓట్ మీల్:

ఇది కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ నిల్వలను నియంత్రిస్తుంది ఓట్ మీల్. పైగా ఊబకాయం వంటి సమస్యలు కూడా మీ దరి చేరవు.

తృణధాన్యాలు:

మీరు డైట్ లో తృణధాన్యాలని కూడా తీసుకుంటూ ఉండండి. రక్తంలో గ్లూకోస్ స్థాయిలని స్థిరీకరిస్తుంది అలానే రక్తంలోని కొలెస్ట్రాల్ ని కూడా స్థిరీకరిస్తుంది. అలానే బాదం ని కూడా డైట్ లో తీసుకుంటూ వుండండి. పసుపు ని కూడా వంటల్లో వాడుతూ వుండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version