Breaking : ఏపీకి అలర్ట్‌.. తుఫానుగా మారుతున్న అల్పపీడనం..

-

ఏపీని వర్షాలు వీడనంటున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఇప్పుడు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు. ఈ తుఫాను ఈశాన్య దిశగా పయనిస్తూ, ఒడిశా తీరాన్ని దాటి, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను సమీపిస్తుందని వివరించారు అంబేద్కర్. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం ఈ తుపాను ఏపీపై స్వల్ప ప్రభావం చూపుతుందని వెల్లడించారు అంబేద్కర్. అయినప్పటికీ ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, తుపాను ప్రభావం ఉండొచ్చని భావిస్తున్న 105 మండలాల అధికారులను అప్రమత్తం చేశామని అంబేద్కర్ తెలిపారు.

ఆయా మండలాల్లో యంత్రాంగాన్ని సంసిద్ధం చేశామని అంబేద్కర్ వివరించారు. తుపాను నేపథ్యంలో, మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లరాదని అంబేద్కర్ స్పష్టం చేశారు. ప్రజలు తుపాను ప్రభావాన్ని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అత్యవసర సహాయం, తుపాను సమాచారం కోసం 1070, 1800 4250101, 0863 2377118 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని అంబేద్కర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version