హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో జంట జలాశయాలకు భారీగా వరద వచ్చిచేరుతోంది. ఉస్మాన్‌సాగర్‌కు 2 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో… అధికారులు 2 గేట్ల ద్వారా 832 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1786.65 అడుగులు ఉంది. అలాగే.. హిమాయత్ సాగర్‌కు 500 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో 2 గేట్లను ఎత్తిన అధికారులు 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలేస్తున్నారు.
హిమాయ్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులుకాగా, ప్రస్తుతం 1760.50 అడుగులు వద్ద నీరు ఉన్నది. ఇక, జీడిమెట్లలో ఉన్న ఫాక్స్‌సాగర్ చెరువుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో ఉమామహేశ్వర కాలనీవాసులు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే కాలనీ నీటమునిగింది. కొంపల్లి, గుండ్లపోచంపల్లి నుంచి ఫాక్స్‌సాగర్‌కు వరద పెద్దఎత్తున వస్తున్నది.