ఏపీలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో పొగమంచు దారుణంగా కమ్ముకుంటోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అంతటా ఒకే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం కానరావడం లేదని తెలుస్తోంది. దీంతో ఉదయం పాఠశాలలు, ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలనే విశాఖపట్నం ఎయిర్‌పోర్టును మంచు పూర్తిగా కమ్మేసింది.శనివారం విమానం ల్యాండింగ్ నిబంధన ప్రకారం కావాల్సినంత వెలుగు లేకపోవడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది పలు విమానాలను దారి మళ్లించారు. ఢిల్లీ-విశాఖపట్నం ఫ్లైట్‌ను భువనేశ్వర్ వైపు, హైదరాబాద్-విశాఖపట్నం, బెంగళూరు- విశాఖపట్నం విమానాలను హైదారాబాద్‌కు మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమకు పూర్తిగా సహకరించాలని కోరారు.