శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత !

-

స్మగ్లర్లు రోజురోజుకు తెలివి మీరి పోతున్నారు. పోలీసులు, నిఘా విభాగం అధికారులు ఎంత హెచ్చరించినా బుద్ధి మార్చుకోవడం లేదు. కొత్తదారులు వెతుక్కుంటూ మరి అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా భారీగా బంగారం స్మగ్లీన్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు.

దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడి వద్ద 2.58 కోట్ల విలువచేసే ఐదు కేజీల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కష్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మహమ్మద్ నసీర్ అనే కేటుగాడు బంగారానికి సిల్వర్ కోటింగ్ చేసి తరలించే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన కష్టమ్స్ అధికారులు స్కానింగ్ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కష్టమ్స్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version