వెదర్‌ అప్డేట్‌ : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

-

వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్‌ 29న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం రాగల 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో రాగల మూడురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 158.8 మిల్లీమీటర్లు కాగా.. 220 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 4 నెలల వ్యవధిలో సాధారణం కంటే 15శాతం అధికంగా వర్షాలు కురిశాయని వాతావరణశాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు అక్టోబర్‌ మూడో వారం తర్వాత వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నందున.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.

ఈ ఏడాది రుతుపవనాలు రాక ఆలస్యం కాగా.. ఉపసంమరణ సైతం ఆలస్యమవుతుందని వాతావరణశాఖ పేర్కొంది. గతేడాది సైతం రుతుపవనాల ఉపసంహరణ సైతం రెండువారాలు ఆలస్యమైందని చెప్పింది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో మెదక్‌, నిజామాబాద్‌, వరంగల్‌, సంగారెడ్డి సహా 18 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని, హైదరాబాద్‌ పరిధిలో సాధారణ వర్షపాతం 616.5 మిల్లీమీటర్లు కాగా.. 775.6 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైదందని ఐఎండీ వివరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version