హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్షాల హెచ్చ‌రిక‌..!

-

హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (IMD) వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఆ విభాగం బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌తోపాటు న‌గరానికి ఆనుకుని ఉన్న ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. జూలై 19వ తేదీ వ‌ర‌కు న‌గ‌రంలో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

వాతావ‌ర‌ణం మేఘావృత‌మై ఉండ‌డంతోపాటు ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని, కొన్ని చోట్ల ఉరుముల‌తో కూడిన జ‌ల్లులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వ‌ర్షాల వ‌ల్ల లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. అందువ‌ల్ల సంబంధిత విభాగాల‌కు చెందిన అధికారులు, సిబ్బంది ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు.

ఇక భార‌త వాతావ‌ర‌ణ విభాగం భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌కు యెల్లో హెచ్చ‌రిక జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version