ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లోని ముంబై జిల్లాలో రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీనితో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) బుధవారం నగరంలోని అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలకు సెలవు దినంగా ప్రకటించింది. అంతే కాకుండా బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ రోజు కోర్టుకు సెలవు ప్రకటించారు.
విద్యుత్ అంతరాయం కూడా ముంబై నగరాన్ని ఇబ్బంది పెట్టింది. గాలి దుమ్ము కూడా రావడంతో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అవసరం అయితే మినహా ముంబై విడిచి ఎవరూ బయటకు రావొద్దు అని కోరారు. నగరంలో 12.20 సెం.మీ వర్షం నమోదైంది, శివారు ప్రాంతాలలో రాత్రి సమయంలో 27.50 సెం.మీ వర్షం కురిసిందని ముంబై అధికారులు పేర్కొన్నారు. సెంట్రల్ ముంబైలోని సియోన్, మాతుంగా, కుర్లా, చునాభట్టి, మజాగావ్, మసీదు బందర్ మరియు బైకుల్లా ప్రాంతాల నుండి భారీగా వర్షపు నీరు దిగువ ప్రాంతాలకు చేరుకుంది.