ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు.. కనిపించకుండా పోయిన రైల్వే పట్టాలు.. !!

-

వర్షకాలం వచ్చిదంటే అనుకోని ప్రమాదాలు వెన్నంటే ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే.. ఇప్పటిదాక కరోనాతో జాగ్రత్తగా ఉన్నాం.. ఇకనుండి కరోనా వైరస్‌తో పాటుగా వర్షాలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఇక నగరంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండగా, ప్రకాశం జిల్లాలో పడుతున్న భారీ వర్షాలకు జిల్లాలో వాగులు, వంకులు పొంగి పొర్లుతున్నాయి.

ఇక నిన్న రాత్రి బేస్తవారిపేట మండలం జగ్గంబొట్ల కృష్ణాపురంలో కురిసిన వర్షానికి రైల్వే ట్రాక్‌ మొత్తం దెబ్బతిందట. అంతే కాకుండా పట్టాలపై నుండి వరద నీరు పొంగి పొర్లడంతో రైల్వే పట్టాలు కూడా కనిపించకుండా పోయాయట. ఇక ప్రస్తుతం కరోనా నేపధ్యంలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.. కాగా గుంటూరు నుండి గుంతకల్లు మధ్య సరకు రవాణా చేసే రైళ్లకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడిందట. అయితే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు ట్రాక్ మరమ్మత్తు పనులు చేసేందుకు ప్రయత్నించగా వరద నీటి కారణంగా సాధ్యపడలేదని, వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పడితే గానీ ఈ లైన్లు మరమ్మత్తులు చేసేందుకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు..

 

ఇదిలా ఉండగా ఇక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు కంభం-సోమిదేవిపల్లి మార్గమధ్యలో కూడా రైల్వే స్తంబాలు కూలిపోయాయని చెబుతున్నారు.. ఇక వర్షాలు మొదలైన తొలిరోజుల్లోనే ఇలాంటి ఆటంకాలు కలుగుతుంటే.. ఇక ముందు ముందు ప్రజలు ఎన్ని అవస్దలు పడాలో అని అంటున్నారట కొందరు..

Read more RELATED
Recommended to you

Exit mobile version