సీబీఐ ఎంక్వైరీ: ఒకటే దెబ్బ రెండు పిట్టలు!

-

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇందులో భాగంగా చంద్రబాబు పాలనలో అవినీతిపై మాటల విమర్శలు మానేసి, చేతలకు దిగింది. ఇందులో భాగంగా… సీబీఐ ఎంక్వరీని ఫిక్స్ చేసింది. బాబు హయాంలో అవినీతి ఆరోపణలు చాలానే వచ్చాయని చాలా కథనాలే ఉన్నాయి. కానీ వాటన్నింటినీ నెక్స్ట్ రోలో పెట్టి… ప్రధానంగా రెండు విషయాలను ఫస్ట్ రోకి తీసుకొచ్చింది ఏపీ సర్కార్! అందులో ఒకటి ప్రధానంగా చంద్రబాబుకు ఎఫెక్ట్ అవ్వగా మరొకటి పూర్తిగా లోకేష్ కు ఎఫెక్ట్ అయ్యేది కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం!

గత టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు తీసుకుంది. చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలపై ప్రభుత్వం పక్కా సమాచారంతో ఉందని పేర్ని నాని చెప్పిన లెక్కలను బట్టి అర్ధమవుతుంది. బాబుపై అధికంగా ఎఫెక్ట్ పడే.. చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫాలలో సుమారు. రూ.150 కోట్ల మేర అవినీతి జరిగిందని… ఏపీ ఫైబర్ గ్రిడ్‌ లో జరిగిన పనుల్లో సుమారు రూ. 200 కోట్లపైనే అవినీతి జరిగిందని, ఆ విషయం ప్రాథమిక విచారణలో తేలిందని చెబుతుంది ఏపీ సర్కార్. ఈ ఫైబర్ గ్రిడ్ వ్యవహారం నాటి ఐటీ మంత్రి అయిన లోకేష్ కి ఫుల్ ఎఫెక్ట్ అని అంటున్నారు విశ్లేషకులు.

మిగిలిన శాఖల్లో జరిగిన అవినీతి గురించి రెండో ఫేస్ లో ఆలోచిద్దామని అనుకున్నారో ఏమో కానీ.. ఇలా బాబు – చినబాబులు ఇరుక్కునే పనికే సర్కార్ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ఎంక్వైరీలో బాబు – చినబాబులే కీలకం కాబోతున్నారు. తన ప్రెస్ మీట్ లో పేర్ని నాని ఆల్ మోస్ట్ జరిగిన అవినీతిపై ఒక క్లారిటీ ఇచ్చేసిన తరుణంలో… సీబీఐ ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు నిగ్గు తేలనున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఏది ఏమైనా… మైకుల ముందు మాటలు మానేసి, చేతల్లోకి దిగిందన్న మాట ఏపీ సర్కార్. ఇది గనుక నిరూపణ అయితే… ఒకే దెబ్బకు రెండు పిట్టలూ రాలిపోతాయనడంలో సందేహం లేదనే అనుకోవాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version