Breaking : శ్రీరాంసాగర్‌ 36 గేట్లు ఎత్తివేత..

-

గత వారం రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే.. భారీ వర్షాలతో జలశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాలకు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కర్ణాటకలో వర్షాలతో ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీరు జూరాలకు చేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.43 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 23 గేట్ల ద్వారా 1,46,147 క్యూసెక్కుల నీటిని దిగువకు వెళ్తున్నది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.48 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

దీంతో పాటు.. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగున భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 1,94,200 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు 36 గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1087.70 అడుగులు ఉన్నది. ప్రాజెక్టులో మొత్తంగా 90.30 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. అయితే ఇప్పుడు 75.46 టీఎంసీ నీరు ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version