నిన్న రాత్రి నుంచి తెలంగాణలోని కరీంనగర్, మెదక్, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు.
ఈ నేపథ్యంలోనే…. సూర్యాపేట జిల్లాలో అకాల వర్షాల పట్ల అధికారులను అప్రమత్తం చేశారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డితో సమీక్షా, రెస్క్యూ చర్యలు చేపట్టాలంటూ మున్సిపల్, రెవిన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి జగదీష్ రడ్డి. దీంతో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి. టీఆరెస్ పార్టీ శ్రేణులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాలని కూడా మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.అటు హైదరాబాద్ మహా నగరంలో నిన్న భారీ వర్షం కురిసింది. అమీర్ పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్, బేగంపేట లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.