ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా హెరాయిన్ పట్టివేత!

-

ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా హెరాయిన్ పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.29.28 కోట్ల ఉంటుందని అధికారులు వెల్లడించారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి మాదకద్రవ్యాలను గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. హెరాయిన్‌ను పాలిథిన్ కవర్‌లో ప్యాకింగ్ చేసి తరలిస్తున్నట్లు తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

ప్రయాణికుడిని అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్‌(NDPS Act) కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ హెరాయిన్‌ను ఎక్కడికి, ఎవరికోసం తరలిస్తున్నారనే అంశంపై విచారణ చేపట్టారు.ప్రయాణికుడిని ప్రత్యేకంగా విచారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు కేంద్రంగా భారీగా మాదక ద్రవ్యాలు, గోల్డ్ స్మగ్మింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version