Breaking : జోషీమఠ్‌ భారీగా మంచు.. ప్రమాదపుటంచున ఆధ్యాత్మిక కేంద్రం

-

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి కుంగిపోవడంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. భూమికి పగుళ్లు రావడం, నిర్మాణాలు కూలిపోవడం వెనుక ఉన్న కారణాలు అన్వేషించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆధ్యాత్మిక ప్రాంతం జోషీమఠ్‌లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో ప్రమాదపుటంచున ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంలో భారీగా హిమం పేరుకుపోతున్నది. అయితే మరో వారం రోజుల పాటు వాతావరణం ఇదే విధంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఈ నెల 23 నుంచి 27 వరకు భారీ హిమపాతంతోపాటు, వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మంచు పర్వతాలతో కూడిన సుందర తలమైన జోషీమఠ్‌ అనేక మందికి పవిత్రమైన దైవభూమి. కానీ అభివృద్ధి, మౌలిక వసతుల పేరిట చేపట్టిన విచక్షణ లేని అశాస్త్రీయ నిర్మాణాల వల్ల మొత్తం ఆ ప్రాంత ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్నది. గతకొంతకాలంగా చేపడుతున్న పలు ప్రాజెక్టులతో పట్టణం కుంగిపోతున్నది. క్రమంగా ఇండ్లు నేలమట్టమవుతున్నాయి.

 

కాగా, జోషీమఠ్‌ ఏటా 10 సెంటీమీటర్లు కుంగిపోతున్నదని తాజా అధ్యయనంలో తేలింది. 2018 నుంచి ఈ కుంగుబాటు ప్రారంభమైందని వెల్లడైంది. అరిస్టాటిల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ థెస్సాలోనికి, యూనివర్సిటీ ఆఫ్‌ స్ట్రాస్‌బర్గ్‌ శాస్త్రవేత్తలు తాజా ఉపగ్రహ చిత్రాలను పరీక్షించారు. గత నాలుగేండ్లుగా జోషీమఠ్‌ కింది భూమిలో గురుత్వాకర్షణ అస్థిరత ఏర్పడుతున్నదని గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version