రసవత్తరంగా “మా” అధ్యక్ష ఎన్నికలు : బరిలోకి న‌టి హేమ

-

తెలంగాణలో లాక్‌ డౌన్‌ ఎత్తేసింది తెలంగాణ సర్కార్‌. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్ ల సందడి మొదలైంది. అయితే.. ఈ షూటింగ్‌ లు ఒక వైపు అయితే… మరో వైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నికల హడావుడి కూడా ఆరంభం అయంది. రెండేళ్ళకోసారి జరిగే మా ఎన్నికలు ఈ సారి కూడా రసవత్తర పోరుకు తెరతీయబోతున్నాయి. ప్రస్తుత కమిటీ కాలపరిమితి ముగిసినా… కరోనా వల్ల ఈ సారి కొత్త కమిటీ ఎంపిక ఆలస్యం అయింది. లాక్ డౌన్‌ ముగియడంతో ఈ ఎన్నికలు పోరు మొదలైంది. అయితే.. ఈసారి మా అధ్యక్ష ప‌ద‌వికి విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్.. యువ‌హీరో మంచు విష్ణు.. సీనియ‌ర్ న‌టీమ‌ణి జీవిత రాజ‌శేఖ‌ర్ పోటీబ‌రిలో నిల‌వ‌గా.. ఇప్పుడు నాలుగో పోటీదారు గా సీనియ‌ర్ స‌హాయ న‌టి హేమ పేరు ఖ‌రారైంది. త‌న వారికోసం పోటీకి దిగుతున్నాన‌ని హేమ అంటున్నారు.

ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ.. “మాలో గ‌త కొన్నేళ్లుగా `మా` ఉపాధ్యక్షురాలిగా సంయుక్త కార్యద‌ర్శిగా ఈసీ స‌భ్యురాలిగా ప‌ద‌వులు చేప‌ట్టాను ..ప‌ద‌వుల‌కు న్యాయం చేశాను. ఈసారి కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మా అసోసియేష‌న్ ఎన్నిక‌లు రానే వ‌చ్చాయి. ఈసారి ట్రెజ‌ర‌ర్ ప‌ద‌వికి పోటీ చేయాల‌ని అనుకున్నాను. ఎల‌క్షన్ ముందు ఆలోచ‌న ఇది. కానీ ఆలోచ‌న మారింది. ఎల‌క్షన్ ని ప్రక‌టించ‌గానే ప్రకాష్ రాజ్ గారు .. మంచు విష్ణు బాబు.. జీవిత గారు పోటీ చేస్తున్నార‌ని తెలిసింది” అని పేర్కొ‌న్నారు హేమ.

“పెద్దలంతా ఎల‌క్షన్ బ‌రిలో దిగుతున్నారని తెలిసాక‌.. పెద్దలు పెద్దల వివాదాల్లో మ‌న‌మెందుకు చిక్కుకోవాలి.. పోటీప‌డాలి.. అస‌లు పోటీ చేయొద్దనే అనుకున్నాను. నిన్నటి ప్రక‌ట‌న అనంత‌రం సినీప్రముఖుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొన్నాను. నేను ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసిన‌ప్పుడు నా స్నేహితులు ముఖ్యంగా లేడీ స‌పోర్ట‌ర్స్ అంతా న‌న్ను మెజారిటీతో గెలిపించిన సినీప్ర‌ముఖులంతా ఫోన్ చేసి నువ్వెందుకు పోటీ చేయ‌కూడ‌దు.. నువ్వుంటే బావుంటుంది. ఎవ‌రైనా క‌ష్టాలు చెప్పుకోవాల‌న్నా అర్థ రాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు.. అందుకే నువ్వు కావాలి అని అడుగుతున్నారు. నేను పోటీ చేయ‌న‌ని నావాళ్లంతా ఒత్తిడి చేస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ స‌మ‌యంలో నాకు అండ‌గా నిలిచిన వారంద‌రికోసం నా వారి కోసం మా ఎన్నిక‌ల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాల‌నుకుంటున్నాను..“ హేమ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version