ఫోన్ పే యూజర్లకు ఓ గుడ్‌న్యూస్. ఇప్పుడు పేమెంట్స్ యాప్‌లో సరికొత్త ఆటో టాప్ అప్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
యూపీఐ విధానం ద్వారా ఈ నయా ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. వినియోగదారులు తన ఫోన్‌పే వాలెట్‌ను ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు. అంటే.. ఫోన్‌పే వినియోగదారులు బ్యాలన్స్ అయిపోయిన ప్రతీసారి వాలెట్‌ను మాన్యువల్‌గా లోడ్ చేసే ఇబ్బంది లేకుండా.. ఆటోమెటిక్‌గా బ్యాలన్స్ లోడ్ అయిపోతుంది. దీని ద్వారా యూజర్లకు సమయం ఆదా అవుతుంది. ఎలాగో ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ సక్సెస్ రేట్ 99.99 శాతం. ఇది ఓ విధంగా గూగుల్ పేకు గట్టిపోటినిస్తుందని చెప్పవచ్చు. దీనిపై ఫోన్‌పే స్పందిస్తూ.. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా డిజిటల్ పేమెంట్‌లో ఇది ఓ పెద్ద ముందడుగు అని పేర్కొంది. దీని వల్ల ఫోన్ పేకు మరింత మంది వినియోగదారులు యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పింది.
ఆటో పేమెంట్‌ను ఇలా సెట్ చేయండి
- మొదట ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి.. హోం పేజీలోని వాటెట్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ’టాప్–అప్’ ఐకాన్‌పై క్లిక్ చేయండి.
- అప్పుడు, మీరు వాలెట్‌కు ఎంత డబ్బును జత చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేసి టాప్‌టాప్ ప్రారంభించండి.
- ఉదాహరణకు మీ ఆటో టాప్–అప్ వాలెట్‌లో రూ .500 – 3,000 వరకు లోడ్ చేయాలనుకుంటే.. మీ అమౌంట్‌ను ఎంటర్ చేసి ’టాప్–’ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత స్క్రీన్ కింద ఉండే ఆటో టాప్–అప్ వాలెట్ ఆప్షన్‌ను అప్ – సెట్ చేయాలి. యుపీఐ పిన్ ఎంటర్ చేసి.. మీ బ్యాంక్ అకౌంట్‌ను ధ్రవీకరించాల్సి ఉంటుంది
- అంతే మీ ఫోన్ పే వాలెట్ వెంటనే రీఛార్జ్ అవుతుంది.
ఈ డబ్బులను మొబైల్ రీఛార్జ్, కరెంట్ బిల్, డిష్ రీచార్జ్ వంటి ఇతర చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు. దీనికి అనేక స్క్రాచ్ కార్డులు కూడా అందిస్తోంది ఫోన్ పే.