గూగుల్‌ మీట్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌!

-

కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసుల నుంచి వర్క్‌ ఫ్రం హోం వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. దీంతో ఇతర యాప్స్‌కు పోటీ ఇచ్చేలా గూగుల్‌ మీట్‌ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రతి మీటింగ్‌లో 25 మంది కో–హోస్ట్‌లను యాడ్‌ చేయొచ్చు. మీటింగ్‌ నిర్వహించే హోస్ట్‌కు ఉండే అన్ని అధికారాలు కో–హోస్ట్‌లకు ఉంటాయి. అంతేకాకుండా, కో–హోస్ట్‌లు పార్టిసిపేంట్లను మ్యూట్‌ చేయడం, మీటింగ్‌లను ముగించడం వంటి పనులను కూడా చేయగలరు.

google-meet

వీరంతా మీటింగ్స్‌ సమర్థవంతంగా, సులభంగా నిర్వహించేందుకు హోస్ట్‌కు సహాయపడతారు. దీనివల్ల హోస్ట్‌లు.. మీటింగ్‌లో జాయిన్‌ అయ్యే వ్యక్తుల రిక్వెస్టులను ఈజీగా కంట్రోల్‌ చేయవచ్చు. సేఫ్టీ ఫీచర్స్‌.. గూగుల్‌ వర్క్‌ స్పేస్‌ వినియోగించే ఎడ్యుకేషన్‌ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు ఇవి గూగుల్‌ మీట్‌ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి క్విక్‌ యాక్సెస్‌ ఫీచర్‌ డిఫాల్ట్‌గా ఎనేబుల్‌ చేసి ఉంటుంది. ఈ ఫీచర్‌ ఎనేబుల్‌ చేయడం వల్ల సమావేశంలో పాల్గొనే పార్టిసిపెంట్‌లు హోస్ట్‌ డొమైన్‌ నుంచి ఆటోమేటిక్‌గా జాయిన్‌ అవ్వచ్చు. మొబైల్‌ లేదా డెస్క్‌టాప్‌ డివైజ్‌ నుంచి అయినా మీటింగ్‌లో చేరవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version