రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా నియామకం అయినప్పటి నుంచి ఆయనపై విమర్శలు ఇంతకు ముందుకంటే పెరిగాయనే చెప్పాలి. అయితే ఆయనపై మొదటి నుంచి సొంత పార్టీలోనే వ్యతిరేకత ఏర్పడినప్పటికీ, తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఆయన వాటిపై పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే అవి చేసింది సొంత పార్టీ నేతలే కావడంతో ఆయన పెద్దగా రెస్పాండ్ కాకుండా మౌనంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన ఎంత మంది వ్యతిరేకించినా కూడా పట్టు వదలకుండా చివరకు టీపీసీసీ చీఫ్ గా నియామకం అయ్యారు.
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన టీపీసీసీ పగ్గాలు చేపబట్టాక ఆయనపై ఒక విమర్శ మాత్రం బలంగా వినిపిస్తోంది. అదే ఆయన్ను బలహీన పరుస్తోంది. అదేంటంటే ఆయన చంద్రబాబు ఏజెంట్‌గా తెలంగాణలో పనిచేస్తున్నారని, చంద్రబాబు ఏది చెబితే ఆయన అదే చేస్తారంటూ విమర్శిస్తున్నారు. ఇక టీఆర్ ఎస్ నేతలు అయితే ఓ అడుగు ముందుకేసి కాంగ్రెస్‌ను చంద్రబాబు కొనుక్కున్నారని, ఆయన ఏజెంటే ఇప్పుడు దానికి బాస్ అంటూ విమర్శిస్తున్నారు.
కానీ ఇంతటి ఘోరమైన విమర్శలకు మాత్రం రేవంత్ గట్టిగా కౌంటర్ విసరలేకపోతున్నారనే ఆందోళన అభిమానుల్లో కనిపిస్తోంది. ఇక రేవంత్ ఇలా సైలెంట్ గా ఉంటే ఆయనపై ఈ ముద్ర ఇలాగే కొనసాగే ప్రమాదం కూడా ఉంది. ఇక దీన్నే రానున్న కాలంలో ప్రతిపక్షాలకు మంచి అస్త్రంగా మారే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక రేవంత్ మౌనం చివరకు వచ్చే ఎన్నికల్లో దీన్నే టార్గెట్‌గా చేసుకుని తెలంగాణలో ఉన్న అన్ని విపక్ష పార్టీలు ఓట్లు దండుకునే ఛాన్స్ ఉంది. మరి ఇప్పటికైనా రేవంత్ స్పందించి వీటికి గట్టి కౌంటర్ వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.