ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలనే కాదు.. జాతీయ పక్షులను కూడా ప్రభావితం చేస్తున్నారు. అది ఎంటి అనుకుంటున్నారా.. మోదీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కొన్ని నెమళ్లు ఉన్నాయి. వాటిని మోదీ చాలా బాగా మచ్చిక చేసుకున్నారు. నెమలి సహజ స్వభావం ప్రకారం మనుషులకి దగ్గరగా ఉండవు.. కానీ ఈ నెమళ్లు మోదీ కి దగ్గరగా భయం లేకుండా ఎంతో చక్కగా ఆడుకుంటున్నాయి.. అవి పురివిప్పి నాట్యం చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. మోదీ ఇంటి పరిసరాలు ప్రాంగణం గ్రామీణ వాతావరణానికి ప్రతిబింబించేలా కనిపిస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
దేశ సంస్కృతి, జానపద కథల ప్రేరణతో కొత్త గేమ్స్ రూపొందించి డిజిటల్ గేమింగ్ రంగానికి నాయకత్వం వహించే స్థానానికి దేశం ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో బొమ్మల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన చర్చా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని పెంచేందుకు బొమ్మలు ఒక అద్భుతమైన మాధ్యమమని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించి ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయాలని స్టార్టప్ కంపెనీలు, యువతను కోరారు.
PM Narendra Modi shared a video on his Instagram page, an assortment of shots where he is feeding peacocks at his residence during his morning routine of exercises. The peacocks are often a regular companion during the PM’s routine of exercises.
— All India Radio News (@airnewsalerts) August 23, 2020