నాలుగుగోడల మధ్య జరగాల్సింది..నలుగురి ముంగిట జరిగితే అది ఇబ్బందిగానే ఉంటుంది. మరి దానికి ఆచారం అని పేరు పెడితే..?అర్థంకాలేదా..!! ఒక ఆచారం ప్రకారం.. పెళ్లైన తర్వాత జరిగే మొదటి రాత్రి పెళ్లికూతిరి తల్లి ఎదుట చేయాలట.. ఒకవేళ పెళ్లికూతిరికి తల్లి లేకపోతే మరెవరైన బంధువుల ఎదుట అలా చేయాలట.. మరుసటి రోజు రాత్రి ఆ బాధ్యత పెళ్లికొడుకు తల్లి తీసుకుంటుంది. ఇలా వారి ఎదుట కార్య కానిచ్చేయాలి.. నిజానికి ఫస్ట్ నైట్ అంటే సినిమాల్లో చూపించినట్లు ఉండదు.. ఆ రోజు రాత్రి అంతా ఒకరి గురించి ఒకరి మాట్లాడుకోవడం, భవిష్యత్ కార్యచరణపై చర్చించుకోవడమే సరిపోతుంది. లవ్ మ్యారేజ్‌లో అయితే కథ వేరుంటది..! కానీ ఈ ఆచారం ఏంటి..? ఎందుకు పెట్టారో చూద్దామా..!
ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకమైన హనీమూన్ సంప్రదాయాలు ఉన్నాయి. అక్కడ కూతురు, అల్లుడు తల్లి ముందు హనీమూన్ జరుపుకుంటారట. ఈ వింత సంప్రదాయాన్ని ఇప్పటికీ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో పాటిస్తుండటం విశేషం.. పురాతన సంప్రదాయం ప్రకారం, పెళ్లి తర్వాత మొదటి రాత్రి, నూతన వధూవరులు తమ హనీమూన్‌ను ఆనందిస్తారు, వారితో పాటు వధువు తల్లి అక్కడే ఉంటుంది. వధువుకు తల్లి లేకుంటే, ఇంట్లోని పెద్దవారు నవ వధూవరుల గదిలో నిద్రిస్తారట.
వధువు తల్లి నూతన వధూవరులకు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఎలా గడపాలి, మొదటి రాత్రి ఏం చేయాలి అనే విషయాల గురించి మార్గనిర్దేశం చేస్తారట. మరుసటి రోజు ఉదయం పెళ్లికొడుకు తల్లి ఈ బాధ్యతను తీసుకుంటారు. కొత్త జంట అనుభావాన్ని ఇంటి సభ్యులందరితో పంచుకుంటారు. నవదంపతులు సెట్ అయే వరకు వారిపై పెద్దల పర్యవేక్షణ ఉంటుంది.
ఒకప్పుడు అంటే ఇలా చేసేవాళ్లేమో కానీ..ఈరోజుల్లో యువతకు పెళ్లికి ముందే అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉంటుంది. ఇక మార్గనిర్దేశాలు, అవగాహన కార్యక్రమాలు అవసరం లేదేమో కదా!! ఏదేమైనా ఇప్పటికీ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఈ సంప్రదాయాన్ని పాటించడం అంటే పెద్ద విషయమే..!