శభాష్ బిగ్ బీ అమితాబ్… లక్ష మందికి రేషన్…!

-

దేశంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కోట్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోయి నానా అవస్థలు పడుతున్నారు. చాలా కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. సినీ పరిశ్రమకు కరోనా వైరస్ దెబ్బ చాలా గట్టిగా తగిలింది. కరోనా కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా కట్టడి కాకపోవడం తో లాక్ డౌన్ ని పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉంది.

దీనితో ఇప్పట్లో సినీ పరిశ్రమలో షూటింగ్ లు ఉండే అవకాశం లేదు. దీనితో సినీ ప్రముఖులు అందరూ కూడా ముందుకి వస్తున్నారు. సినీ కార్మికులకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భారీ సాయం చేయడానికి ముందుకి వచ్చారు. ఆల్‌ ఇండియా ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ కాన్ఫెడరేషన్‌కు చెందిన లక్ష మంది కార్మికులకు నెల రోజుల పాటు నిత్యావసరాలను అందించడానికి ముందుకి వచ్చారు.

దీనిపై ఇప్పుడు ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేయడంతో చాలా మంది ఇప్పుడు పనులు లేక అవస్థలు పడుతున్నారు. ఇక మహింద్రా కంపెని కూడా ముందుకి వచ్చింది. లాక్ డౌన్ సమయంలో పేదల ఆహారం కోసం దేశంలో పది ప్రాంతాల్లో భారీ వంట శాలలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆ సంస్థ వారం రోజుల్లో 50 వేల మందికి ఆహారం అందించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version