తగ్గుతున్న కరోనా… భారీగా తగ్గిన కేసులు…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్టే కనపడుతుంది. రోజు పెరుగుతున్న కేసులు… ఆదివారం తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా రోజూ 75వేలకు పైగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం మాత్రం అవి 70 వేల లోపు నమోదు అయ్యాయి. మరణాలు రోజూ 5వేలకు పైగా నమోదు అయితే… ఆదివారం 5వేల లోపే కరోనా మరణాలు నమోదు కావడం శుభపరిణామం.

ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 1271875 ఉండగా కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య 941046గా ఉంది. వీరిలో 895432 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుంది. 45614 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలో ఆదివారం 24970 కేసులు నమోదవగా… మొత్తం కేసుల సంఖ్య 336327తో 4 లక్షలకు చేరువలో ఉన్నాయి. మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి.

మొత్తం మరణాలు 9605 ఉన్నాయి. స్పెయిన్ లో 694 మంది ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్, యూకే, టర్కీ, స్విట్జర్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, కెనడా, ఆస్ట్రియా, పోర్చుగల్, బ్రెజిల్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, స్వీడన్, ఆస్ట్రేలియా, నార్వే, రష్యా, ఐర్లాండ్, చిలీ, డెన్మార్క్ ఇండియా, పోలాండ్, రొమేనియా, మలేసియా, ఈక్వెడార్, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్, జపాన్ దేశాల్లో కరోనా కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయి. మన దేశంలో మొత్తం కేసులు 4289 ఉన్నాయి. మరణాల సంఖ్య 118 గా ఉంది.తెలంగాణలో 269 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version