టీ కొట్టు పక్కన తన కొత్త సినిమా సీడీలు చూసి హీరో నిఖిల్ ఏం చేశాడో తెలుసా..?

-

నిఖిల్ సిద్దార్థ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. టీఎన్ సంతోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబర్ 20న విడుదలైన ఈ పాజిటివ్ టాక్ తెచ్చుకొంది. అయితే, నిఖిల్ తన సినిమా సక్సెస్ టూర్ కోసం గుంటూరు వెళ్లాడు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని హైవేపై ఉన్న ఓ టీ దుకాణం వద్ద ఆగాడు. అయితే ఆ పక్కనే సీడీలు అమ్మే బండి వద్దకు వెళ్లి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అర్జున్ సురవరం సీడీలు కూడా వాటిలో ఉండడంతో నిఖిల్ ఆవేదనకు లోనయ్యాడు. అక్కడున్న వారిని సినిమా చూశారా అని అడగ్గా, డీవీడీలో చూశాం అని చెప్పడంతో మరింత బాధపడ్డాడు.

ఎంతో కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తున్నాం. 40 రూపాయిలకే రోడ్డుపై అమ్ముతారా అని నిలదీశారు. దీంతో ఆ మహిళ తన కుటుంబ పోషణ కోసం సీడీలు అమ్ముతున్నామని, అంతే తప్ప తనకు ఏం తెలిదని చెప్పింది. ఈ ఘనటకు సంబందించిన ఓ విడీయోను నిఖిల్ తన వ్యక్తిగత ట్విటర్ లో పోస్టు చేశారు. అలాగే సినిమా ఎంతో ఖర్చు చేసి తీస్తామని, వేల కుటుంబాలు దీనిపై ఆధారపడి బతుకుతున్నాయని, దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని వారిని కోరాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version