వైసీపీ ఎమ్మెల్యే ర‌జ‌నీకి డెడ్‌లైన్‌… కుటుంబంతో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకుంటా… వీడియో

-

గుంటూరు జిల్లా చిల‌కలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీకి చుక్క‌లు క‌నిపిస్తున్నాయా ? నియోజ‌క వ‌ర్గానికి చెందిన ఓ వ్య‌క్తి చేసిన వీడియో పోస్టు.. ఆమెను తీవ్ర ఇబ్బందిలోకి నెట్టేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజకీయ ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. వీటిలో వ్య‌క్తిగత స‌మ‌స్య ల‌తోపాటు .. నియోజ‌క‌వ‌ర్గం అంశాలు కూడా ఉన్నాయి. అయితే, వీటిని ప‌రిష్క‌రించంలో ఎమ్మెల్యే దూకు డు ప్ర‌ద‌ర్శించ‌డంలేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తాజాగా త‌న వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ను ఉటంకిస్తూ.. ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఓ వ్య‌క్తి చేసిన వీడియో పోస్టు సోష‌ల్ మాధ్య‌మాల్లో తీవ్ర‌స్థాయిలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అస‌లు.. ఆ వ్య‌క్తి ఎవ‌రు? ఎలాంటి పోస్టు చేశారు? వ‌ంటి విష‌యాల‌ను ఆయ‌న మాట‌ల్లోనే.. “గౌర‌వ నీ యు లైన ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ గారికి న‌మ‌స్కారం. నాపేరు చిన్న‌క‌ర్ణి శామ్యూల్‌, ఎడ్ల‌పాడు మండ‌లం, వంకా య‌ల పాడు గ్రామం. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను నేను ఎస్సీ కార్పొరేష‌న్‌లో ట్రాన్స్‌పోర్టు సెక్ష‌న్‌లో కారు లోను కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాను., ఈ విష‌యంలో అధికారుల చుట్టూ అనేక సార్లు తిరిగాను. ఈ క్ర‌మంలో నాకు లోన్ కింద కారును శాంక్ష‌న్ చేశారు. ఇది నాకు జూలై 8, 2019న డెలివ‌రీ చేసేందుకు రెడీ చేశారు. నా తోపాటు ఇదే ప‌థ‌కం కింద లోను పెట్టుకున్న వారికి కూడా అదే రోజు శాంక్ష‌న్ చేశారు. అంద‌రికీ కార్లు హాండోవ‌ర్ చేశారు. అయితే, నా ఒక్క‌డి విష‌యం వ‌చ్చే స‌రికి ఎమ్మెల్యే ర‌జ‌నీగారు ఎస్సీ కార్పొరేష‌న్ అధికారుల‌కు ఫోన్ చేసి.. నా కారును ఆపించారు. దీంతో నాకు లోను కింద వ‌స్తుంద‌ని భావించిన కారు నిలిచిపోయింది. నాకు ముగ్గురు ఆడ‌పిల్ల‌లు ఉన్నారు. అయితే, కారు వ‌స్తుంది. ఉపాధి దొరుకుతుంద‌ని ఎదురు చూసిన నేను కారు ఆగిపోయే స‌రికి పెళ్లాం పిల్ల‌ల‌ను పోషించ‌లేక‌, వారిని మా అత్త‌గారి ఇల్లు తెనాలిలో విడిచి పెట్టి కారు కోసం ఆరు మాసాలుగా జుట్టు గ‌డ్డాలు పెంచుకుని ఎదురు చూస్తున్నాను.

ఎమ్మెల్యే గారికి ఒక‌టే విన్న‌పం.. ఈ రోజు డిసెంబ‌రు 8, నాకు కారు ఆపించి ఆరు మాసాలు అయింది. ఈ నెల 15 లోపు నాకు మీరు ఏదో ఒక న్యాయం చేయ‌ని ప‌క్షంలో నేను నాభార్య పిల్ల‌ల‌తో క‌లిసి గుంటూరు క‌లెక్ట‌ర్ ఆఫీస్ ముందు పెట్రోలు పోసుకుని సూసైడ్ చేసుకోవ‌డం త‌ప్ప మ‌రో మార్గం క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికైనా మీరు స్పందించి మాకు న్యాయం చేయాల‌ని కోరుతున్నాను. లేనిప‌క్షంలో మేం సూసైడ్ చేసుకోవ‌డం ఖాయం “. ఈ వీడియో పోస్టు ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. మ‌రి దీనిపై ర‌జ‌నీ ఎలా రియాక్ట్ అవుతారో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version