ప్రభాస్ గారు నాకు సొంత అన్నతో సమానం! అలాంటి వ్యక్తిని చూడలేము..!!

-

సంతోష్ శోబన్ తాజాగా  నటించిన కొత్త “కళ్యాణం కమనీయం”.ఇందులో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. సంక్రాంతి పండుగకు ఈ నెల 14న ఈ “కళ్యాణం కమనీయం” విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా  హీరో సంతోష్ శోభన్ ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి అలాగే ప్రభాస్ తో తన సాన్నిహిత్యం గురించి చెప్పుకొచ్చారు.

సంతోష్ మాట్లాడుతూ.. సంక్రాంతికి రిలీజ్ చేసుకోవాలనేది నా కల. అది ఈ చిత్రంతో తీరుతోంది. నేను మాత్రం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సినిమాలు చూస్తాను. ఎందుకంటే నా సినిమా నేను ఆల్రెడీ చూశాను కాబట్టి.ఇక్సు నాన్న దర్శకత్వంలో ప్రభాస్ అన్న నటించిన వర్షం కూడా సంక్రాంతికే రిలీజ్ అయ్యింది. అందుకే తెలియని ఆత్రుత వుంది.

రెగ్యులర్ సినిమాల లా “కళ్యాణం కమనీయం”  ఉండదు.. ఈ ఒక  పర్సనల్ ఎక్సీపియరెన్స్ లా ఉంటుంది. ఇక నాన్న తో సినిమా చేసిన ప్రభాస్ గారు నన్ను సొంత తమ్ముడు లా చూసుకుంటున్నారు.ప్రభాస్ అన్న నాకు ఇచ్చే సపోర్ట్ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆయన ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్. నా గత చిత్రాల ప్రమోషన్ కు సపోర్ట్ చేశారు. ఈ పాట రిలీజ్ చేస్తున్నారు. నేను ఆయన అభిమానిని.ప్రభాస్ అన్న ప్రేమ దక్కినందుకు నేను ఎంతో అదృష్టం చేసుకున్నా అని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version