బుజ్జితో షాక్ ఇచ్చిన హీరో ప్రభాస్

-

‘డార్లింగ్స్.. మన జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి’ అంటూ అందరిలోనూ ఆసక్తి పెంచిన హీరో ప్రభాస్ బుజ్జితో ఫ్యాన్స్కు షాక్ ఇచ్చారు. ‘కల్కి’ మూవీలో ‘బుజ్జి’ పాత్రను రేపు రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ‘డార్లింగ్స్.. మీరు నా బుజ్జిని కలవడానికి వేచి ఉండండి’ అంటూ ఇన్స్టా స్టోరీ పెట్టారు. కాగా స్క్రాచ్ ఎపిసోడ్ 4 పేరిట రేపు సాయంత్రం 5 గంటలకు మేకర్స్ ఈ పాత్రను రివీల్ చేస్తారు.

సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాని మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version