నరేష్ తోనే అన్ని సమస్యలు.. ఆయనతో సెట్ కాదు : శ్రీకాంత్

-

మా అసోషియేషన్‌ ఎన్నికలు వివాదం కొనసాగుతూనే ఉంది. ఫలితాలు విడుదలైనప్పటికీ.. మా సభ్యుల మధ్య వివాదం చెలరేగుతూనే ఉంది. ఈ నేపథ్యం లోనే తాజాగా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. మా అసోషియేషన్‌ వివాదం పై ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన ప్రకాశ్‌ రాజ్‌.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానెల్‌ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

”మా’ సంక్షేమం కోసం.. తమ ప్యానెల్‌ నుంచి గెలిచినవారు అంతా రాజీనామా చేస్తున్నారని స్పష్టం చేశారు ప్రకాశ్‌ రాజ్‌. ఇవాళ చేసిన తమ సభ్యుల రాజీనామాలను మంచు విష్ణు ఆమోదించాలని ప్రకాష్‌రాజ్ డిమాండ్‌ చేశారు. తెలుగు వాడు కానీ వాడు కూడా పోటీ చేయడానికి వీలు ఉంది అని మంచు విష్ణు హామీ ఇస్తే.. బై లాస్ మార్చమని చెబితే తన రాజీనామా వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు ప్రకాష్‌రాజ్. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో పూర్తిగా రౌడీ యిజం జరిగిందని ఆరోపించారు. రెండు ప్యానెల్ సభ్యులు పనిచేయలేరని… అందుకే విష్ణు ప్యానెల్ కే పూర్తి భాధ్యత ఇస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version