‘జాంబీ రెడ్డి’ ఫస్ట్‌ లుక్ విడుద‌ల‌

-

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. యాపిల్‌ ట్రీ స్టూడియోస్‌ పతాకంపై రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మించారు. ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించారనే సస్పెన్స్‌కు తెరదించుతూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, మోషన్‌ పోస్టర్‌లను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. సమంత లీడ్‌ రోల్‌ చేసిన ‘ఓ బేబీ’లో ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి’తో హీరోగా పరిచయమవుతుండ‌డం గ‌మ‌నార్హం.

నేడు తేజ స‌జ్జా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ రిలీజ్ చేసింది చిత్ర‌యూనిట్‌. ఇక ఈ పోస్టర్‌లో తేజ గద పట్టుకొని ఉండగా, జాంబీలు అతనిపై దాడి చేయబోతున్నట్లు కనిపిస్తోంది. తన వెనకవైపు చిరంజీవి బొమ్మ ఉన్న షర్ట్‌ ధరించి స్టైల్‌గా ఇంట్రడ్యూస్‌ అయ్యాడు తేజ. ఈ సినిమాకు సంగీతం మార్క్‌ కె. రాబిన్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news