Vishal: క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తా.. హీరో విశాల్ సంచ‌ల‌న నిర్ణ‌యం

-

Vishal: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం యావత్ సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టివేసింది. ఆయ‌న అభిమాన లోకం క‌న్నీటీ సంద్రంలో మునిగిపోయింది. పునిత్ రీల్ హీరోగానే.. ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. పునీత్ 1800 మందికి పైగా పేద పిల్లలకు ఉచిత విద్య, 45 ఫ్రీ స్కూల్స్ , 26 అనాధాశ్రమాలు, 16 వృద్దాశ్రమాలు, 19 గోశాలలు నిర్వ‌హించారు. అంతేకాదు .. త‌న మ‌ర‌ణాంత‌రం త‌న కండ్ల‌ను దానం చేసి.. ఒకరికి కంటి వెలుగు అయ్యారు పునీత్. ఇలా రియ‌ల్ హీరోగా ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. పునీత్ కు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితుల్లో హీరో విశాల్ ఒకరు. తాజాగా పునీత్ మృతి గురించి మాట్లాడుతూ కన్నీటి ప‌ర్యంతం అయ్యారు. అంతేకాదు ఆయ‌న బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఆయ‌న ఆశయాల‌ను ముందుకు తీసుక‌వెళ్తాన‌ని తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. విశాల్ తన సినిమా ‘ఎనిమీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఈ ఈవెంట్ లో పునీత్ రాజ్‌కుమార్‌కు సంతాపం తెలిపింది. త‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఎమోష‌న‌ల్ అయ్యారు. పునీత్ మ‌ర‌ణం చిత్ర సీమ‌కే కాకుండా సమాజానికి కూడా తీరని లోటు అని వెల్లడించారు. పునీత్ ప్రారంభించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను తాను కొనసాగిస్తానని ప్రకటించాడు. ఇక నుంచి పునీత్ చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు ప్రకటించారు. పునీత్ ఆశ‌యాల‌ను తాను ముందుకు తీసుక‌వెళ్తాన‌ని తెలిపారు.

ఇప్పటికే విశాల్ కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నారు. సినిమాలతోపాటు రైతులకు, పేద ప్రజలకు సాయం చేస్తూ.. వారిని ఆడుకుంటున్నాడు. త‌న సినిమాలకు సంబంధించిన ప్రతి టికెట్ నుంచి ఒక రూపాయి రైతులకు, పేద ప్ర‌జ‌ల‌కు చేరేలా చేస్తున్నారు.త‌న‌ ఫంక్షన్స్ లో బొకేలను వాడొద్దని వాటికీ ఉపయోగించే డబ్బు ఆడపిల్లల చదువుకు ఉపయోగించమని త‌న అభిమానుల‌కు పిలుపు నిచ్చారు విశాల్. ఇక ఇప్పుడు పునీత్ బాధ్యతను తాను ముందు తీసుకెళ్తాన‌న‌డంతో మరోసారి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు విశాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version