మరోసారి విజయవాడ ఉలిక్కిపడింది. విజయవాడలో బిల్డర్ దారుణహత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న బిల్డర్ ను దుండగులు దారుణంగా హత్యచేశారు. ఇంట్లో నిద్రిస్తున్న బిల్డర్ ను లోపలకు చొరబడి తల పగల కొట్టి దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరకున్నారు. అతడివద్ద ఉన్న ఆధారాల మేరకు
మృతుడు పీతల అప్పలరాజుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో ఉండగా అప్పిరాజు వ్యాపారం నిమిత్తం ఒక్కడే విజయవాడలో నివాసం ఉంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
మృతుడు గత కొంతకాలంగా విజయవాడలోని వాంబే కాలనీలో నివాసం ఉంటున్నట్టు తెలిపారు. ఈ ఘటన కూడా వాంబే కాలనీ అన్నపూర్ణ బార్ సమీపంలో జరిగినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారంలో లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగిందా లేదంటే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.